స్థానిక పాలనంతా వాలంటీర్ల చేతుల్లో పెట్టడానికి కారణం ఏంటి..? - ఏపీ పొలిటికల్ న్యూస్
PRATHIDWANI: పేరుకు ప్రజాసేవ.. తెల్లారి లేస్తే తరించేది అధికార పార్టీ సేవలో.. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై చాలాకాలంగా ఉన్న తీవ్ర విమర్శ ఇది. తమ ప్రయోజనాల కోసం వైకాపా కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ... ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోందన్న ఫిర్యాదులూ ఎన్నో. సర్వేల పేరిట ప్రజల వ్యక్తిగత గోప్యత, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ.. ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుంచి తొలగింపు వరకూ... అంతా ఇష్టారాజ్యం అన్నట్లు దందా నడిపిస్తోంది. ఇంకో అడుగు ముందుకేసి... ఓట్ల నమోదు, తొలగింపులోనూ వాలంటీర్లే రాజ్యమేలుతున్నారు... ఇలా ఎన్నో ఆరోపణలు. కోర్టులు, ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేస్తున్నా వాలంటీర్లను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోంది... ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా సర్పంచులు, ఉన్న ప్రభుత్వ వ్యవస్థను దాటి.. స్థానిక పాలనంతా వాలంటీర్ల చేతుల్లో పెట్టడానికి కారణాలు ఏంటి.. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిస్థితి ఏమిటి అనే అంశాలపై.. నేటి ప్రతిధ్వని.