ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat Prathidhwani Program on Removal of Voters

ETV Bharat / videos

Prathidwani: బతికున్న వాళ్లని సైతం.. ఓటర్ల జాబితాలో చంపేస్తున్న వైసీపీ - ఓటర్ లిస్టువీడియోలు

By

Published : Aug 21, 2023, 10:03 PM IST

Prathidwani: అడ్డదారులకు అలవాటుపడిన అధికార వైసీపీ బతికున్న వాళ్లని కూడా ఓటర్ లిస్టుల్లో చంపేస్తోంది. తమకు ఎవరైతే ఓటు వేయరో, ప్రభుత్వంపై ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షాలకు ఓటేస్తారనే అనుమానం ఉందో అలాంటి వారి సమాచారాన్ని తెప్పించుకుని ఓటర్ల జాబితా నుంచి వాళ్ల పేర్లను గల్లంతు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఉదంతం రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టించింది. చివరికి కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ప్రతిపక్షాలకు వెళ్లే ఓట్లను గల్లంతు చేస్తున్నారనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమూ గ్రహించింది. ఈ అక్రమాలపై ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.  ఆంధ్రప్రదేశ్‌లోని ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన అక్రమం. ఇక 175 నియోజకవర్గాల్లో, ఎన్ని మండలాల్లో, ఎన్ని గ్రామాల్లో ఇలాంటి అక్రమాలకు వైసీపీ పాల్పడుతోందో మీరే అర్థం చేసుకోండి. మీ ఓటు భద్రంగానే ఉందా? లేక గల్లంతైందా? ఓటర్ గుర్తింపు కార్డు ఉందా? మీ ఓటు సమీపంలోని పోలింగ్‌ బూత్‌ లోనే ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details