prathidwani: సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది..? - సీపీఎస్ రద్దు వార్తలు
వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఈ మాట చెప్పి ఎంతకాలం అయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా? "ఓపీఎస్ - సీపీఎస్" అసలు ఈ రెండు పింఛను పథకాల మధ్య వ్యత్యాసం ఏమిటి? సీపీఎస్‌పై ఎందుకు ఈ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు? చాలా రోజులుగా కాదు.. నెలలు, సంవత్సరాలుగా సీపీఎస్ రద్దు కోసం దిల్లీ వరకు ఆందోళనలు చేస్తున్నారు. అయినా ఉద్యోగుల డిమాండ్ నెరవేరక పోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఈ సీపీఎస్ విధానంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఈ విధానంలో రిటైర్ అయిన వారికి అందుతున్న పెన్షన్లు ఎలా ఉన్నాయి? గడిచిన 4 సంవత్సరాల్లో సీపీఎస్ రద్దు దిశగా ప్రభుత్వం వైపు నుంచి ఏమేం ప్రయత్నాలు జరిగాయి? దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ రద్దు చేశాయి. అక్కడి ప్రభుత్వాలపై ఎంత మేరకు అదనపు భారం పడింది? అదే ఇక్కడ అమలు చేయగల పరిస్థితి లేదా? సీపీఎస్ వల్ల సగటు ఉద్యోగి ఏమేమి నష్టపోతున్నాడు... వాటిని వేరే మార్గంలో అయినా భర్తీ చేసే అవకాశం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.