Prathidwani పాఠశాల విద్య వ్యవస్థతో జగన్ సర్కారు చెలగాటం..!
Prathidwani: పాఠశాల విద్యతో సర్కారు చెలగాటం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అతికినట్లు సరిపోతాయి ఈ మాటలు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలపై ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర అక్షింతలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ప్రభుత్వ ప్రచారాలు, వాస్తవాలకు పొంతన ఎందుకు పొంతన కుదరడం లేదు? హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కాకపోయినా.. 5వ తరగతి విద్యార్థులు, రెండో తరగతి పాఠ్యాంశాల్ని చదవలేక పోవడం విస్మయం కలిగించే విషయమే.. ప్రభుత్వబడుల్లో ఎందుకీ పరిస్థితి? ఒకవైపు ప్రభుత్వం విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాం అంటోంది. రేపటితరం గురించే నా ఆలోచనంటారు జగన్. ఆ ప్రచారం, వాస్తవాలకు ఎందుకు పొంతన కుదరడం లేదు? అసలు నాలుగేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానం ఏమిటి? ఆంగ్లమాధ్యమం, హేతుబద్దీకరణ , సీబీఎస్ఈ, బైజూస్.. ఇలా రోజుకో మాట చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి? విద్యాహక్కు 2009 ప్రకారం, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, పాఠశాలల వసతులు ఎలా ఉండాలి? నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితిపై మీరు ఏం గమనించారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.