వాస్తవాల ఆధారంగా బడ్జెట్ కూర్పు జరిగిందా..? - ap budget 2023 24
PRATHIDWANI: రెండు లక్షల 79 వేల 279 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్‌లో డైరెక్ట్ బెనిఫీషియరీ ట్రాన్స్‌ఫర్-DBT ప్రథకాలకు 54 వేల 228 కోట్లు కేటాయించారు. 2 లక్షల 6 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ గణాంకాల్లో తెలిపింది. పన్ను ఆదాయాన్ని కూడా లక్ష కోట్ల మేర అంచనా వేసింది. కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.56 వేల కోట్లు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో అసలు అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందా.. వాస్తవాల ఆధారంగా బడ్జెట్ కూర్పు జరిగిందా.. 4సంవత్సరాల అనుభవం నేపథ్యంలో ఈ కేటాయింపులు ఎలా ఉన్నాయి. అమలుకు నోచుకొనే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి. 2019-20లో 72%, 2020-21లో 82% ఖర్చు చేశారు. 2021-22లో ఆపసోపాలు పడుతూ ఖర్చుచేసింది.. 83% ఇప్పటికే అప్పులపై ఆధారపడి రోజులు గడుస్తున్న దుస్థితి.. 2023-24 బడ్జెట్‌లో రూ.54,587 కోట్లుగా ద్రవ్య లోటు లాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.