ముగిసిన బాబు, పీకే సమావేశం- పార్టీ క్యాడర్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్ - Prashant Kishor
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 7:37 PM IST
|Updated : Dec 24, 2023, 6:31 AM IST
Prashant Kishor Chandrababu Meet: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ - చంద్రబాబు సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటలపాటు చంద్రబాబు-ప్రశాంత్ కిషోర్ చర్చించారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నివాసం నుంచి గన్నవరం బయలుదేరారు. లోకేశ్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య కీలక అంశాల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారు. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలు వివరించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పీకే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే పలు అంశాలు వివరించారు. నిరుద్యోగం, ధరలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషించారు. విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.
దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని, ఒకరిద్దరు మినహా మంత్రులకు సున్నా మార్కులని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందనే భావన ప్రజల్లో వచ్చిందన్న పీకే, ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహరచన ఉండాలని సూచించారు. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీటీపీ కార్యాచరణ ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని తెలిపినట్లు తెలుస్తోంది.