షార్ట్ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం - తప్పిన ప్రాణ నష్టం - AP accident news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 7:31 PM IST
Power Plant Employees Bus Completely Burnt Due to Short Circuit:నెల్లూరు రూరల్ మండలం ముత్తుకూరు రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. కాకుపల్లి వద్ద ప్రధాన మార్గంలో పవర్ ప్లాంట్‌కు చెందిన బస్సు సాంకేతిక లోపంతో కాలిపోయింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ముత్తుకూరు ప్రాంతంలో పవర్‌ప్లాంట్‌కు చెందిన బస్సు ఉద్యోగ సిబ్బందితో ధనలక్ష్మిపురం వైపు వస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బస్సులో నుంచి పొగలు వచ్చాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది.
అందులో ఉన్న పవర్ ప్లాంట్ సిబ్బందిని డ్రైవర్ అప్రమత్తం చేయడంతో 15 మంది సిబ్బంది కిందకు దిగేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం జరిపారు. కాని అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ముత్తుకూరు రోడ్డులో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పరిశ్రమల్లో పని చేసే సిబ్బంది నెల్లూరుకు తిరిగి వస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది.