Pournami Garuda Seva in Tirumala: వైభవంగా తిరుమలేశుడి పౌర్ణమి గరుడసేవ - గరుడసేవ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 12:25 PM IST
Pournami Garuda Seva in Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి పౌర్ణమి గరుడ సేవను టీటీడీ ఘనంగా నిర్వహించింది. వర్షం కారణంగా ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామి వారి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి జరిగే గరుడసేవను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా గోవింద నామాలతో మారుమోగింది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. గరుడవాహనం ద్వారా ఆ అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన స్వామివారు తాను దాసుదాస ప్రపత్తికి దాసుడని తెలియజేస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు.. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే వారి సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి విశ్వాసం.