ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోతిన మహేశ్

ETV Bharat / videos

Pothina Mahesh Fire on YSRCP: 'వైసీపీ మంత్రులకు పవన్ కల్యాణ్​పై ఉన్న శ్రద్ధ.. శాఖలపై లేదు' - వైఎస్సార్సీపీ నేతలపై పోతిన మహేశ్ కామెంట్స్

By

Published : Aug 2, 2023, 3:56 PM IST

Janasena Pothina Mahesh Fires on YSRCP Leaders: వైసీపీ మంత్రులకు.. పవన్ కల్యాణ్​పై ఉన్న శ్రద్ధ తమ శాఖలపై లేదని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన మహేశ్ విమర్శించారు. వైసీపీ నాయకులకి పవన్ కల్యాణ్ ఫోబియా పట్టుకుందని అన్నారు. పవన్ కల్యాణ్ పేరు ఎత్తినా, ఫోటో చూసినా.. వైసీపీ నాయకులు, సీఎం జగన్ వణికిపోతున్నారన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై పోతిన మహేశ్ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికై మంత్రులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. 'బ్రో' సినిమా గురించి డైరెక్టర్, ప్రొడ్యూసర్లు మాట్లాడుతారని.. వైసీపీ మంత్రులకు ఏం పని అని ప్రశ్నించారు. మేం కూడా రాబోయే ఎన్నికల కోసం ఒక వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నామన్నారు. త్వరలో సొంత డబ్బులతో ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నానని తెలిపారు. ఆ వెబ్ సిరీస్​కి ఏ పేరు బాగుంటుందో ప్రజలు సూచించాలని కోరారు. వైసీపీ నాయకుల్లో ఉన్న నటులకు తమ వెబ్ సిరీస్​లో అవకాశాలు ఇస్తామన్నారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని.. వైట్ మనీ చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి బాగా తెలుసన్నారు. 

ABOUT THE AUTHOR

...view details