ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_Tortured_TDP_Leader

ETV Bharat / videos

నోట్లో గుడ్డలు కుక్కి, బూటు కాళ్లతో తన్ని - పుంగనూరులో సీఐ దాష్టీకం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 8:25 PM IST

Updated : Nov 5, 2023, 9:54 AM IST

Police Tortured TDP Leader చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు టీడీపీ ఎస్సీ సెల్‍ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణను హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పుంగనూరు, అంగళ్లులో జరిగిన ఘటనల కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‍ ఉన్నా.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం పుంగనూరు కోర్టులో హాజరుపరచగా ముందస్తు బెయిల్‍ ఉండటంతో న్యాయాధికారి వెంకటరమణ రిమాండ్​ను తిరస్కరించారు. ఈ  క్రమంలో తనను నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టారీతిన బూటు కాళ్లతో తన్నారని.. రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారని వెంకటరమణ తెలిపారు.

పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో గాయపడిన వెంకటరమణను.. పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్‍ అంశంలో సాంకేతిక కారణాలను చూపుతూ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తనపై కల్లూరు సీఐ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు వెంకటరమణ వాపోయారు.

Last Updated : Nov 5, 2023, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details