ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని అక్రమ మట్టి తవ్వకాలు

ETV Bharat / videos

రాజధానిలో రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టితవ్వకాలు.. నలుగురు అరెస్ట్​ - రిటర్నబుల్​ ప్లాట్లలో మట్టి అక్రమ తరలింపు

By

Published : May 31, 2023, 1:43 PM IST

Arrest In Amaravati Illegal excavation : రాజధానిలో ప్లాట్లలో అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు చర్యలు మొదలయ్యాయి. భూ సమీకరణలో భాగంగా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్​ ప్లాట్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే అక్రమ తవ్వకాలపై పోలీసులు 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించగా.. పోలీసులు చర్యలకు పూనుకున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి అక్రమంగా మట్టి తరలిస్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు. అందులో ఉద్దండరాయుని పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. బీహార్​కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. వీరి అరెస్ట్​తో పాటు అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం. ఇవే కాకుండా గతంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు రాజధాని నిర్మాణానికి తీసుకువచ్చిన కంకర, సిమెంట్​తో పాటు ఇనుమును కూడా ఎత్తుకెళ్లినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details