సమ్మెను ఉద్ధృతం చేస్తున్న అంగన్వాడీలు - అడ్డుకుంటున్న పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 10:19 AM IST
Police Stop Anganwadi Protest :గత 20 రోజుల నుంచి డిమాండ్ల పరిష్కరించాలని అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ల వద్ద బైఠాయించాలని పిలుపును ఇచ్చారు. ఈ నెల 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళుతున్న అంగన్వాడీలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
Anganwadi Workers Agitation :శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కోసం మడకశిర నుంచి బస్సులో వెళ్తున్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధిని పోలీసులు బస్సు ఆపి నోటీసులు ఇచ్చారు. మడకశిర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆమె స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు పూచికత్తుపై ఆమెను స్టేషన్ నుంచి పంపించారు.