ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_Seized_32_KG_Ganja_in_Guntakal

ETV Bharat / videos

రైల్వే స్టేషన్​లో 32 కిలోల గంజాయి స్వాధీనం - ఇద్దరు అరెస్ట్, పరారీలో ఒకరు - గుంతకల్ రైల్వే స్టేషన్‌లో గంజాయి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 2:49 PM IST

Police Seized 32 KG Ganja in Guntakal :ఒడిశా నుంచి గుజరాత్​కు గంజాయి రవాణా చేస్తుండగా అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్​లో ఆర్​పీఎఫ్, జీఆర్​పీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో జీఆర్​పీ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. 

 Guntakal Railway Police Seized Marijuana :డీఎస్పీ అబ్దుల్ అజీజ్ విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాకు చెందిన బాగబాన్ పోలై, శత్రుగాన్ తరణితో పాటు మరొక వ్యక్తి కలిసి గంజాయిని గుజరాత్​కు తరలించడానికి ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఒడిశాలోని బరంపూర్ నుంచి గుజరాత్ తీసుకువెళ్లడానికి గుంతకల్ రైల్వే స్టేషన్​లో దిగారని, గోవా రైలు ఎక్కడానికి  ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులను చూసి వారు పారిపోవడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. అప్రమత్తమైన  పోలీసులు బాగబాన్ పోలై, శత్రుగాన్ తరణిని అరెస్టు చేసి సుమారు 6.40 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, మరొకరు పరారీలో ఉన్నారని వివరించారు. 

Marijuana Seized in Guntakal Railway Station : ఒరిస్సా నుంచి గుజరాత్​కు తీసుకెళ్తే 15 వేల రూపాయలు ఇస్తారని అందుకు తీసుకెళుతున్నట్లు విచారణలో నిందితుడు తెలిపారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. 16 ప్యాకెట్లలో ఉన్న 32 కిలోల గంజాయిని జీఆర్​పీ, ఆర్​పీఎఫ్ పోలీసులు పట్టుకున్నట్లు జీఆర్​పీ డీఎస్పీ వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details