ఆంధ్రప్రదేశ్

andhra pradesh

police_seized_23kgs_ganja_in_west_godavari

ETV Bharat / videos

పాలిటెక్నిక్​ కళాశాల సమీపంలో గంజాయితో యువకులు - దాడి చేసి పట్టుకున్న పోలీసులు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:50 PM IST

Police Seized 23Kgs Ganja in West Godavari : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కె.సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ యూ. రవి ప్రకాష్, డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్​ఎస్​వీ నాగరాజుకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 

Ganjai Transportation Thadepally Gudem : ఎస్సై సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇరువురు యువకులు గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న షేక్ అక్బర్, ఓరుగంటి షాలేం రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. మత్తు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తమ జీవితాలను సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆయన వెంట ఎస్సై జీజే ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ జీ. శ్రీను, కానిస్టేబుల్స్ సీ.శ్రీనివాసరావు, కే.రాజు,కే.మహేష్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details