ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_Removed_TDP_Banners_at_Yuvagalam_Padayatra_TDP_Leaders_Allegations

ETV Bharat / videos

Police Removed TDP Banners at Yuvagalam Padayatra TDP Leaders Allegations: "అధికారుల ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం" - వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 12:15 PM IST

Police Removed TDP Banners at Nara Lokesh Yuvagalam padayatra TDP Leaders Allegations :తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోకేశ్​కు స్వాగతం పలుకుతు యువగళం బ్యానర్లను టీడీపీ శ్రేణలు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. వాటిని పోలీసులు తొలగించి.. వాటి స్థానంలో వైసీపీ బ్యానర్లు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ బ్యానర్లు ఎందుకు కడుతున్నారని.. అటుగా వెళ్తున్న యువగళం బృందం పోలీసులను ప్రశ్నించింది. పై నుంచి వచ్చిన ఒత్తిడితో తప్పక చేస్తున్నాం అంటూ.. వీడియో తీస్తున్న తెలుగుదేశం నేతలకు బదులిచ్చారు. వీడియో బైట పెట్టొద్దని చాలా సేపు టీడీపీ నేతలను పోలీసులు బ్రతిమలాడారు. వైసీపీ బ్యానర్లు పడిపోతే ఆ నింద తెలుగుదేశం పార్టీపై పడకుండా తాము జాగ్రత్త వహిస్తున్నాం అంటూ పోలీసులు వివరణ ఇచ్చారని టీడీపీ శ్రేణులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details