Police Registered Cases Against Lokesh: లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలపై కేసులు... ఎందుకంటే..! - టీడీపీ వర్సెస్ వైసీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 10:59 PM IST
Police Registered Cases Against Lokesh: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పీఎస్‍లో తెలుగుదేశం జాతీయప్రధానకార్యదర్శి లోకేశ్‌తో పాటు యువగళం సభ్యులపై వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో సీఎం ఫ్లెక్సీని లోకేశ్ చింపించారని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు నల్లజర్ల పోలీసులు లోకేతో పాటుగా టీడీపీ నేతలపై ఐపీసీ 341, 506, RW 149 సెక్షన్ల కింద కేసు పెట్టారు. వైసీపీ నేతలపైకి లోకేశ్ కార్యకర్తల్ని రెచ్చగొట్టి, ఉసిగొల్పుతున్నారని కేసులో పేర్కొన్నారు.
నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ నేతల కవ్వింపు చర్యలను అడ్డుకోవడం పోయి తిరిగి తమనేత పైనే కేసులు పెట్టడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని... తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు. తిమ్మన్నపాలెంలో శుక్రవారం లోకేశ్ ప్రోద్బలంతోనే, వైసీపీ ఫ్లెక్సీ చించివేశారంటూ నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని. నారా లోకేశ్ తో పాటు మరో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నేతలపైన కేసులు పెట్టినట్లు తెలిపారు. యువగలం పాదయాత్ర దారి పొడవునా వైసీపీ కవ్వింపు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను.... అడ్డుకోలేని పోలీసులు టీడీపీ నేతలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని వెంకటరాజు ప్రశ్నించారు.