ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో 300 మొబైలను రికవరీ చేసిన పోలీసులు

ETV Bharat / videos

Mobiles Recovery In Vishaka: 20 లక్షలు విలువ చేసే 300 చరవాణిలను రికవరీ - AP NEWS LIVE UPDATES

By

Published : May 19, 2023, 2:05 PM IST

Police Recovered 300 Mobiles Phones In Visakha : ఒకప్పుడు సెల్ ఫోన్ పోగొట్టుకుంటే అది ఎంత ఖరీదైన మొబైల్ అయిన దానిని మనం మరచిపోవాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. అందులోను మనం పోలీస్ స్టేషన్​కు వెళ్లకుండా ఫిర్యాదు చేయవచ్చు అంటున్నారు విశాఖ పోలీసులు.. అలా 100 మొబైల్​లను బాధితులకు అప్పగించారు సీపీ త్రివిక్రమ వర్మ.  

విశాఖ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల విలువ చేసే 300 చరవాణిలను రికవరీ చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. విశాఖ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న చరవాణులకు సంబంధించి పోలీసు స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. 9490617916 నెంబరు వాట్సాప్​కు హాయ్ అని సంక్షిప్త సందేశం ఇచ్చి వారి పూర్తి వివరాలను పొందుపరిచి దర్యాప్తు చేస్తున్నామని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. చాట్ బాట్ వెబ్ పోర్టల్​కు వచ్చిన ఫిర్యాదుల విచారణలో ఫోన్​లను రికవరి చేశామన్నారు. ఇప్పటి వరకు 100 చరవాణిలను బాధితులకు అప్పగించామని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details