ఆంధ్రప్రదేశ్

andhra pradesh

police_raids_on_cricket_betting_bases

ETV Bharat / videos

Police Raids on Cricket Betting Bases: వైసీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ దందా.. పోలీసుల దాడి.. అదుపులో 30మంది నేతలు? - ap latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 4:50 PM IST

Police Raids on Cricket Betting Bases :ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్​లు ప్రారంభం అవ్వడంతో బెట్టింగ్ బాబులు (World Cup Cricket Match Betting) జోరందుకున్నారు. వైఎస్సార్ జిల్లా భాగంగా పొద్దుటూరులో బెట్టింగ్ ముఠా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందికి పైగా క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారందరిని బైపాస్ రోడ్డులోని ఓ కళ్యాణ మండపంలో ఉంచారు. అక్కడి నుంచి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎదుట హాజరు పరిచేందుకు వాహనాల్లో కడపకు తీసుకెళ్లారు. 

పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రికెట్ బుకీల్లో ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకులు ఉన్నట్లు (YCP Leaders in Cricket Betting) సమాచారం. ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ  మాజీ ఎమ్మెల్యే వరద రాజుల రెడ్డి స్పందిస్తూ.. క్రికెట్​ బెట్టింగ్ వ్యవహారంపై దృష్టి సారించిన జిల్లా ఎస్పీని అభినందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అండదండలతోనే క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుందని, అలాగే మట్కా ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details