ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Obstructed TDP Youth Wing Protests

ETV Bharat / videos

Police Obstructed TDP Youth Wing Protests: విశాఖలో ఉద్రిక్తతకు దారి తీసిన తెలుగు యువత ధర్నా - TDP Youth Wing

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 6:55 PM IST

Updated : Sep 24, 2023, 7:54 PM IST

Police Obstructed TDP Youth Wing Protests: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖలో తెలుగు యువత చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించారు. సాయంత్రం తెలుగు మహిళలు ర్యాలీకి పిలుపు ఇవ్వడంతో ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులేంటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్నాయి.. ఎలా అయినా చంద్రబాబును అరెస్టు చేయాలి అనే దురాలోచనతోనే ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని విమర్శించారు. త్వరలోనే తమ అధినేత చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనే నమ్మకం తమకు ఉందని తెలిపారు.

Last Updated : Sep 24, 2023, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details