ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంజాయి అక్రమ రవాణా

ETV Bharat / videos

Ganja Transportation: క్యాబేజీ బుట్టల మాటున.. గంజాయి అక్రమ రవాణా - illegal transportation of ganja in Visakha

By

Published : May 4, 2023, 8:02 PM IST

Illegal Transportation Ganja: విశాఖ జిల్లా పెందుర్తిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెనగాడి జంక్షన్ వద్ద ఒక బొలెరో వాహనంలో క్యాబేజీ బ్యాగుల మాటన గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కూరగాయల వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు 14 గంజాయి సంచులను స్వాధీనం చేసుకుని బొలెరో వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ బొలెరో వాహనం ఒడిశా నుంచి క్యాబేజీ బుట్టల లోడుతో వస్తున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒకరకంగా వివిధ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక.. తమను తామే మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాను నిలువరించేందుకు.. పోలీసులు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details