ఆంధ్రప్రదేశ్

andhra pradesh

police_department_jobs_cheating_in_krishna_district

ETV Bharat / videos

ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకున్న కేటుగాడు - మోసం వెలుగులోకి వచ్చినా బాధితులకే బెదిరింపులు - కృష్ణా జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 5:43 PM IST

Police Department Jobs Cheating in Krishna District: పోలీస్​ శాఖ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎరచూపి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. మాయమాటలు నమ్మి నగదు ముట్టచెప్పిన నిరుద్యోగులు.. ఈ మోసంపై స్పందనలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడిషనల్ డీజీ సీఐడీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న రవికుమార్... అక్రమ సంపాదనకు నిరుద్యోగులను లక్ష్యంగా పెట్టుకున్నాడు. డీఐజీ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర వేసి.. అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నట్టేట ముంచాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని సోమవారం రోజున స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయగా.. సీపీ కార్యాలయం, నున్న, అజిత్ సింగ్ నగర్ పోలీస్​ స్టేషన్లకు సమాచారం అందించింది. సీఐడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న.. ఈ కేసుపై పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పకూడదని.. ముఖ్యంగా మీడియా ముందుకు వెళ్లకూడదని బాధితుల్ని బెదిరించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details