ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police

ETV Bharat / videos

Houses Demolish: 40 కుటుంబాల నివాసాలు తొలగింపు.. ఆవేదనలో బాధితులు - Nidubrolu Railway Station news

By

Published : May 30, 2023, 3:34 PM IST

Updated : May 30, 2023, 3:56 PM IST

Police demolished residences near Nidubrolu railway station: వారంతా రోజువారి కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే పేదలు. గతకొన్ని ఏళ్లుగా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ చుట్టుప్రక్కల ఉన్న స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని దాదాపు 40 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తాజాగా స్థానిక పోలీసులు మూడవ రైల్యే లైన్ ఏర్పాటు కారణంగా వారుంటున్న నివాసాలను వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు అందజేశారు. ఇంతలోనే ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానివాసాలను కూల్చివేశారు. దీంతో బాధితులు కన్నీరుమున్నీరవుతూ.. గతకొన్ని ఏళ్లుగా కూలీనాలీ చేసుకుని బ్రతుకుతున్నామని, ఉన్నట్టుండి నివాసాలను కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ నిరసనకు దిగారు.

40 కుటుంబాల నివాసాలు తొలగించిన పోలీసులు..గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న స్థలాల్లో సుమారు 40 కుటుంబాలు ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. తాజాగా తెనాలి-మద్రాసు పట్టణాల మధ్య మూడవ రైల్వే లైను ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చ జెండా ఊపాయి. దీంతో రైల్యేశాఖ అధికారులు లైను ఏర్పాటుకు సిద్దమైయ్యారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆక్రమణలను ఈరోజు రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్ దళాలు, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నివాసాలను కూల్చివేశారు. దీంతో బాధితులు ఆవేదన చెందుతూ.. ఒక్కసారిగా ఖాళీ చేయాలంటూ అధికారులు కోరితే తాము ఎట్లా బతకాలని నిరసనకు దిగారు.

అవి రైల్యేశాఖ స్థలాలు..అందుకే ఖాళీ చేయించాం..ఈ సంఘటనపై రైల్వే లీగల్ సెల్ అధికారి ఫణి కుమార్ మాట్లాడుతూ.. ''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తెనాలి-మద్రాసు పట్టణాల మధ్య మూడవ రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నాము. రైల్యే లైన్ ఏర్పాటు కారణంగా చుట్టప్రక్కల స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాసితులను ఖాళీ చేయించాము. ఇప్పటికే అక్కడ నివాసం ఉంటున్న వారికి వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందజేశాము. ఆ తర్వాత ఇంటి ఆవరణల్లో కూడా నోటీసులను ఏర్పాటు చేశాము. ఇందులో వారిపై మేము ఎటువంటి ఒత్తిళ్లు పెట్టలేదు. నిర్వాసితులు నివాసముంటున్న ఆ స్థలాలు.. రైల్వే శాఖకు చెందిన స్థలాలు'' అని ఆయన అన్నారు. 

Last Updated : May 30, 2023, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details