ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీడిన మూడేళ్ల మర్డర్ మిస్టరీ

ETV Bharat / videos

Murder Mystery దొంగతనం చూసిందని హత్య చేశారు.. మూడేళ్ల తరువాత మిస్టరీని ఇలా ఛేదించారు..!

By

Published : Jul 4, 2023, 8:18 PM IST

Three Year Old Murder Mystery : వాళ్లు చేయి తిరిగిన దొంగల ముఠా.. రాత్రి పూట ఇళ్లు తాళం వేసి కనపడితే చాలు ఇట్టే ఇంటిని ఖాళీ చేస్తారు. ఈ దొంగలు మన రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేసి పోలీసు రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. సాఫిగా సాగిపోతున్న వారి అక్రమాలను ఓ మహిళా చూసింది. అంతే వారి గుట్టు బయటపుడుతుందని భావించిన దొంగలు ఆమెను అడ్డుతప్పించాలని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా.. ఆమెను అతి కిరాతకంగా అంతమొందించారు. ఈ హత్య మూడేళ్ల క్రితం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, హత్య మిస్టరీ పోలీసులకు సవాలుగా మారింది. హత్య చేసిన ఆ దుండగులు మాత్రం 'దృశ్యం' సినిమాలో హీరో మాదిరిగా తప్పించుకున్నారు. ఈ కేసును సవాలుగా భావించిన పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 

మూడేళ్ళక్రితం తాము చేసిన దొంగతనం చూసిందన్న కారణంతో ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన దుండగులను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా నాడు తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును వన్ టౌన్, సీసీఎస్ పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే..   అనంతపురం నగరంలోని టీవీ సమీపంలో ఉన్న శివ సాయి నగర్​లో కొత్తగా నిర్మిస్తున్న ఒక ఇంటి వద్ద నిద్రిస్తున్న కుమ్మర లక్ష్మీదేవి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అదే రోజు ఈ సంఘటన జరిగిన పక్కింట్లో దొంగతనం కూడా జరిగింది. 

ఈ రెండు చేసింది ఒకరేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే మూడేళ్ల వరకు నిందితులు తప్పించుకుని తిరిగారు. చివరకు వన్ టౌన్ పోలీసులుతో పాటు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ రెండు ఘటనలకు పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు చెందిన షికారి సర్దార్, షికారి బూజులు, షికారి మద్దిలేటి ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి దొంగతనం చేసి వస్తుండగా.. లక్ష్మీదేవి అరవడంతో ఈ ఘటనకు పాల్పపడినట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 33 గ్రాముల బంగారం, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇంకా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు అనంతపురం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details