ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_Caught_Betel_Nut_Illegal_Transporting_Lorry

ETV Bharat / videos

Police Caught Betel Nut Illegal Transporting Lorry: కోటి రూపాయల విలువైనా వక్కలు అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు - betel nut illegal transporting from kerala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2023, 4:19 PM IST

Police Caught Betel Nut Illegal Transporting Lorry: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డుపై పోలీసులు వక్కలు లారీని అడ్డుకొని ఇద్దరు లారీ డ్రైవర్లను అరెస్టు చేశారు. కేరళ నుంచి ఢిల్లీలోని గుట్కా కంపెనీకి వక్కలు రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో లారీ డ్రైవర్లు తెలిపారు. కేరళలోని ఎర్నాకులం నుంచి దిల్లీలోని గుట్కా కంపేనీలకు ఈ వక్కాలను తరలిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి బిల్లులు లేకుండా వక్కలను లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలో జీఎస్టీ అధికారులు రెండు లారీలను వెంబడించారు. ఒక లారీని జీఎస్టీ అధికారులు స్వాధీనం చేసుకోగా, మరొక లారీ తప్పించుకొని ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. లారీలోని వక్కలు విలువ కోటి రూపాయల పైన ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీలో రవాణా చేస్తున్న వక్కలు మన దేశానికి చెందిన సరుకా లేక ఇతర దేశాలకు చెందినదా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన లారీని ఆంధ్రప్రదేశ్ పోలీసుల అనుమతితో బళ్లారికి తీసుకెళ్లనున్నట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details