Police Cases Against TDP Leaders: చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్వాప్తంగా టీడీపీ నేతల నిరసనలు.. 144 సెక్షన్ అతిక్రమించారంటూ కేసులు - TDP leaders strike in AP over Chandrababu arrest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 1:36 PM IST
Police Cases Against TDP Leaders:తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం నేతల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలను తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. టీడీపీ నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆందోళనలు నిర్వహించినందుకు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్ అతిక్రమించి ఆందోళనలు చేశారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గుడివాడలో ఆందోళనలు నిర్వహించినందుకు టీడీపీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం నేతలు వెనిగండ్ల రాము, వెనిగండ్ల రామకృష్ణ, కడియాల గణేష్ మరో 40 మందిపై ఐపీసీ 341,143,188, R-W 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 144 యాక్టును అతిక్రమించి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు మోపారు. యూట్యూబర్ ఫిర్యాదు మేరకు రాము అనుచరుడు సందీప్‌పై 427, 324, 506 ఐపీసీ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.