అప్పులు తీర్చేందుకు బ్యాంకులో దోపిడీకి పాల్పడ్డాడు! కత్తితో బెదిరించి ఎస్బీఐలో చోరీకి పాల్పడిన నేరస్తుడిని అరెస్టు చేసిన పోలీసులు - AP Crime News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 8:26 PM IST
Police Arrested the Person who Stole From SBI:పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎస్బీఐ బ్రాంచిలో చోరీకి పాల్పడిన నేరస్తుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్కు పంపించామని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నరసాపురం మండలం రుస్తుంబాదకు చెందిన తానేటి సురేష్ బాబు పలువురు వ్యక్తులు నుంచి తక్కువ వడ్డీకి అప్పులు తీసుకుని ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవాడని.. ఇటీవల ముద్దాయి వద్ద అప్పులు తీసుకున్న వారు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో డబ్బులు ఇవ్వలేదని అన్నారు. సురేష్ బాబు అప్పు తీసుకున్నవారి నుంచి వారు ఒత్తిడి చేయడంతో ఏదైనా బ్యాంకులో దొంగతనం చేసి ఆ డబ్బుతో అప్పులు తీరుద్దామని నిర్ణయించుకున్నాడని.. ఆ పథకం ప్రకారం ఈ నెల 1న బ్యాంకులోకి ప్రవేశించి గోల్డ్ లోనుకు వచ్చినట్లు క్యాషియర్ గదిలోకి ప్రవేశించి.. కత్తితో తీసి బెదిరించి అక్కడ ఉన్న రూ 6.50 లక్షలు నగదు బ్యాగులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడని అన్నారు. ఆగంతుకుడును పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడును తానేటి సురేష్ బాబును అరెస్టు చేసి నగదు రికవరీ చేశామని తెలిపారు. అనంతరం నిందితుడును పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డును ఎస్పీ అందించారు.