Poleramma Ammavari Jathara : వెంకటగిరిలో వెలుగుల మహోత్సవం.. ఘనంగా పోలేరమ్మ అమ్మవారి జాతర - Tirupati
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 1:17 PM IST
Poleramma Ammavari Jathara Started Grandly in Venkatagiri: తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందడితో నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శతాబ్దాలుగా సంప్రదాయం ప్రకారం ప్రతి వినాయకచవితి తరువాత 3వ బుధ, గురువారాల్లో నిర్వహించే అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ఈ సారి ప్రభుత్వం ప్రకటించింది. జాతరలో భాగంగా గత ఆదివారం ఘటోత్సవం మొదలైంది. అప్పట్నుంచి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారింది. విద్యుత్ దీపాలంకరణతో పట్టణం అంతటా వెలుగులు నిండాయి.
అమ్మవారి పుట్టినిల్లుగా భావించే కుమ్మరిలో మట్టి విగ్రహాన్ని తయారుచేసి.. అక్కడ నుంచి జీనుగులకు తీసుకెళ్లారు. అనంతరం అమ్మవారిని పూల అలంకరణతో ముస్తాబు చేసి రథం మీద పురవీధుల్లో తెల్లవారుజాము వరకు ఊరేగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. జాతర శాంతియుతంగా జరిగేందుకు 1500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.