ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద ప్రభావిత గ్రామాలు

ETV Bharat / videos

Polavaram Flood Victims ఆ హామీల నీటి మూట ఏమైంది..! సీఎం జగన్​పై అల్లూరి జిల్లా కుయుగూరు పోలవరం ముంపు బాధితుల మండిపాటు - flood victims problems

By

Published : Jul 30, 2023, 7:59 PM IST

Polavaram Flood Victims: జగన్‌ హామీలు నీటి మూటలే అయ్యాయని.. అల్లూరి జిల్లా కుయుగూరుకు చెందిన పోలవలం ముంపు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.! అల్లూరి జిల్లాలో శబరి, గోదావరి నదుల వరద పోలవరం ముంపు గ్రామలను ముంచెత్తింది. కూనవరం- వీఆర్ పురం కలిపే వారధి మీద వరద ప్రవహిస్తోంది. పోలవరం ముంపులోని 114 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వారికి 103 శిబిరాలు ఏర్పాటు చేసి 20 వేల కుటుంబాలను శిబిరాలకు అధికారులు తరలించారు. కోయిగూరు గ్రామ సమీపంలో వరదలో తాటి చెట్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. చింతూరు, కూనవరం మండలాల్లో ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. అయితే ఇంతటీ వరదలో కూడా తమకు న్యాయం చేయాలంటూ.. కుయుగూరుకు చెందిన ముంపు బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గతేడాది వరదల సమయంలో పరామర్శకు వచ్చి సీఎం జగన్ ఇచ్చిన హామీల అమలుకు అతీగతీ లేదని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు తమను మాయమాటలతో.. మోసగిస్తారని ఆక్రోశించారు. పోలవరం ఆర్​ఆర్ ప్యాకేజి ఇవ్వక పోవడంతో ప్రజలు జల దీక్షతో తమ నిరసనను వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details