poisoned in fish pond: చెరువులో విషప్రయోగం.. 15 టన్నుల చేపలు మృతి - లీజుకు తీసుకున్న చెరువులో విషప్రయోగం
poisoned in fish pond: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దారుణం చోటు చేసుకుంది. చేపల చెరువులో ఓ గుర‌్తుతెలియని దుండగుడు విష ప్రయోగం చేయడం స్థానికంగా కలకలం రేపింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓ వ్యక్తి చెరువును లీజుకు తీసుకున్నాడు. ఈ విష ప్రయోగంలో సుమారు రూ.20 లక్షలకు పైగా విలువైన చేపలు చనిపోయాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కంసాలి పాలెం గ్రామంలో పంచాయతీ చెరువును రావిమెట్ల గ్రామానికి చెందిన మిద్దే శ్రీను అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. అయితే తొమ్మిది నెలల క్రితం ఈ చెరువును లీజుకు తీసుకోగా.. అందులో చేప పిల్లల్ని వేసి పెంచుతున్నాడు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఆ చెరువులో కలుపు మందు కలపడంతో 15 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. దీంతో బాధితుడికి సుమారు రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేపపిల్లల్ని కొని పెంచినట్లు తెలిపిన బాధితుడు.. జరిగిన నష్టానికి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరాడు.