PM Narendra Modi Brother Pankaj Bhai Modi Visit SriKalahasti: ముక్కంటి సేవలో ప్రధాని సోదరుడు పంకజ్ భాయి మోదీ - ముక్కంటి సేవలో ప్రధాని సోదరుడు పంకజ్ భాయి మోదీ
PM Narendra Modi Brother Pankaj Bhai Modi Visit Srikalahasti Temple With His Family in Tirupati District : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని పీఎం నరేంద్ర మోదీ సోదరులు కుబుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు పంకజ్ భాయ్ మోదీ, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు దర్శనార్థం వచ్చారు. ఆలయ అధికారులు, స్థానిక బీజేపీ నేతలు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం శ్రీ మేధో గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వారికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అయ్యప్ప, గోపాల్, భరత్ కుమార్, చందు, శ్రీ శ్రీధర్, రమేష్, ఢిల్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.