Pipeline Leakage in Cherlopalli: చెర్లోపల్లిలో పైప్‌లైన్ లీకేజ్.. ఫౌంటెన్‌ను తలపించిన దృశ్యాలు - Drinking Water Wastage in Cherlopalli
Sri Rami Reddy Drinking Water Scheme Pipeline Leakage Huge water Waste in Cherlopalli : అనంతపురం జిల్లా సెట్టూరు మండలం చెర్లోపల్లి సమీపంలో ఎస్ఆర్పీ తాగు నీటి పథకం (శ్రీరామి రెడ్డి) పైపులైనుకు గండి పడటంతో తాగు నీరు భారీగా వృధా అయ్యింది. అహోబిలం రిజర్వాయర్ నుంచి మడకశిర, హిందూపురం నియోజకవర్గాలకు నీటిని అందించే ప్రధానమైన ఎస్ఆర్పీ నీటి పథకంకు సంబంధించిన పైపులైనుకు కళ్యాణదుర్గం - కుందుర్పి ప్రధాన రహదారి పక్కనే చెర్లోపల్లి సమీపంలో గండి పడింది. దీంతో ఎక్కువ మోతాదులో నీరు వృధా అయ్యింది. పైపులైన్‌ను తగిలించే ప్రదేశంలో పెద్ద ఎత్తున నీరు పైకి ఎగిసి పడటంతో ఫౌంటెన్లను తలిపించింది. ఈ దృశ్యాలు రోడ్డు వెంట వెళ్లే వాహనదారులను, స్థానిక ప్రజలను ఆకర్షించాయి. వారిని కొన్ని నిమిషాల పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం అధికారులు ఘటన స్థలానికి చేరుకోని నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు ప్రారంభించారు.