ఆంధ్రప్రదేశ్

andhra pradesh

high_court_on_andhra_university

ETV Bharat / videos

ఆంధ్రా యూనివర్సిటీలో అవినీతిపై హైకోర్టులో పిటిషన్ - విచారణ వాయిదా - VC irregularities in Andhra University

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 5:14 PM IST

Petition in High Court on Corruption in Andhra University:ఆంధ్రా యూనివర్సిటీలో (Andhra University) జరుగుతున్న నిధుల మళ్లింపు, అవినీతిపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. నోటిఫికేషన్ లేకుండా వీసీ ప్రసాదరెడ్డి పోస్టుల భర్తీ చేపట్టారని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో అక్రమ నియామకాలు చేపట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. గవర్నర్ తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ 8 వారాల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఆంధ్ర వర్శిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పూర్వ వీసీ నిర్ణయాలతో సీనియర్‌ ఆచార్యులు అవకాశాలు కోల్పోయారని ఆరోపిస్తూ.. వీటికి సంబంధించిన వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సంఘం ప్రతినిధులు పంపారు. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా ప్రభుతాన్ని ఆదేశించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details