ఆంధ్రప్రదేశ్

andhra pradesh

petition_in_high_court

ETV Bharat / videos

Petition in High Court Against CID Chief Sanjay and AAG Sudhakar Reddy: ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సీఐడీ చీఫ్, ఏఏజీపై హైకోర్టులో వ్యాజ్యం.. - AP United Forum for RTI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 9:44 PM IST

Petition in High Court Against CID Chief Sanjay and AAG Sudhakar Reddy:ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ధాఖలైంది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఈ వ్యాజ్యం దాఖలైంది. ఏపీ యూనైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ (AP United Forum for RTI) క్యాంపైన్ సంస్థ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ సీఎస్, న్యాయ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అలాగే సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్​లను పేర్కొంటూ పిటిషన్ వేశారు. సీసీఏ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సీఐడీ చీఫ్ సంజయ్​తో పాటు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ వ్యాజ్యాన్ని ధాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details