ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Roads Damaged In Vijayawada

ETV Bharat / videos

Damaged Roads: రోడ్లకు గుంతలు.. వాహనాలకు మరమ్మతులు.. ఎక్కడంటే..!

By

Published : May 8, 2023, 1:20 PM IST

Roads Damaged In Vijayawada: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడలో సర్వీసు రోడ్లు, ఇతర రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్, జమ్మిచెట్టు సెంటర్, మాచవరం రోడ్డు, పంజా సెంటర్, గురునానక్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయం కావడంతో వాహనదారులు నానా రకాల అవస్థలు పడుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న రోడ్లు.. చిన్నపాటి వర్షానికి నీట మునుగుతున్నాయి. దీంతో రహదారులు, మురుగు కాల్వలు కనిపించని పరిస్థితి నగరంలో ఉంది. రోడ్లు సరిగా లేకపోవడంతో వాహనాలు తరచూ మరమ్మతులకు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ అధికారులకు పన్నులు వసూళ్లపై ఉన్న శ్రద్ధ నగరంలోని రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడం పట్ల లేదని విమర్శిస్తున్నారు. రహదారులపై ఏర్పడిన గుంతలు పూడ్చకపోవడంతో నిత్యం నగరంలో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు.. 

ABOUT THE AUTHOR

...view details