ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Samajika_Sadhikara_Bus_Yatra

ETV Bharat / videos

ప్రధాన రహదారిపై వైసీపీ బస్సు యాత్ర సభ - తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజలు - andhra pradesh news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:29 PM IST

YSRCP Samajika Sadhikara Bus Yatra: వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ఇప్పటికే ఘోరంగా విఫలమైంది. అయితే బస్సు యాత్ర వలన సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా మలికిపురంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన వైఎస్సార్ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రజలను ఇబ్బందులు పెట్టింది. మలికిపురం ప్రధాన రహదారిపై సభ ఏర్పాటు చేసి గ్రామంలోకి ఆర్టీసీ బస్సులు రాకుండా దారి మళ్లించారు. దీంతో గ్రామంలోకి వచ్చే స్థానిక ప్రయాణికులు కాలినడకన ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వచ్చిన ఈ సభకు రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు అధ్యక్షత వహించారు. అయితే మంత్రులు ప్రసంగిస్తున్న సమయంలోనే డ్వాక్రా మహిళలు కుర్చీల లోంచి లేచి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. డ్వాక్రా మహిళలను అధికారులు తరలించినప్పటికీ వారంతా కాసేపటికే వెనుదిరగడంతో ఎప్పటిలాగే ఈ సభ కూడా ఘోరంగా విఫలమైంది. 

ABOUT THE AUTHOR

...view details