గ్రామంలో అతిసార ప్రబలి 100 మందికి అస్వస్థత - బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 2:50 PM IST
People Sick with Diarrhea in Kurnool District:కర్నూలు జిల్లాలోని లక్ష్మీపురం గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలింది. గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల రెండు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరోచనాలతో అవస్థలు పడుతున్నారు. వైద్య అధికారులు స్పందించి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కలుషితమైన నీరు తాగడం వల్లే అందరికీ ఇలా జరిగిందని గ్రామస్థులు వాపోతున్నారు.
లక్ష్మీపురం గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరుకుని వైద్య శిబిరాన్ని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు. గ్రామస్థులు కొన్ని రోజుల పాటు వేడి నీటిని తాగాలని ఆయన సూచించారు. అలానే ప్రస్తుతం అక్కడ ఉన్న మంచినీటి ట్యాంక్‌ను కూడా శుభ్రం చేయిస్తానని తెలిపారు. గతంలో కూడా లక్ష్మీపురం గ్రామంలో అతిసారం వచ్చిందని ఆయన తెలిపారు. దీనిపై పూర్తి విచారణ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.