ఆంధ్రప్రదేశ్

andhra pradesh

people_protest_not_in_liquor_shop

ETV Bharat / videos

"మాట తప్పను మడమ తిప్పను"అన్న జగన్ - జనవాసాల మధ్యే మద్యం దుకాణాలు - విశాఖలో మద్యం దుకాణం ఎదుట మహిళలు ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 1:53 PM IST

People Protest Not In Liquor Shop: విశాఖలోని అల్లిపురం సమీపంలోని నేరెళ్ల కోనేరు వీధిలో మహిళలు ఆందోళనకు దిగారు. జనవాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. మద్యం దుకాణం మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న స్ధానికులకు టీడీపీ, జనసేన, పలువురు వైసీపీ నేతలు కూడా మద్దతు పలికి ధర్నాలో కూర్చున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి సంతకాల సేకరణ చేపట్టారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడం తిప్పను అని ప్రజలకు చెప్పి మద్యం దుకాణాలు ఎక్కడా కనిపించవు. బయట ఎక్కడా బార్లు ఉండవు అని చెప్పిన మహనుభావుడు. చెప్పిన మాట మీద నిలబడ్డారా. మహిళలు, స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా ఇక్కడ దుకాణాన్ని మూసివేయాలి.-గండి బాబ్జి, మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details