ఆంధ్రప్రదేశ్

andhra pradesh

people_against_the_panyam_mla

ETV Bharat / videos

'పోపో ఏం చేసినావని వచ్చినావు మా ఊరికి బాగొచ్చినావులే ఒక్క రోడ్డెయ్యకపోతివి ' - ఎమ్మెల్యే కాటసానికి నిరసన సెగ - MLA Katasani is unhappy with the leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 5:33 PM IST

People Opposition to Panyam Constituency MLA : పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. అందని ప్రభుత్వ పథకాలను అందినట్లు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కొండచూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీశారు. అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. మూడేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు హంగామా చేసి... ఇప్పటివరకు స్థలాలు కూడా చూపలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. 

గత ప్రభుత్వాల నుంచి పెన్షన్ వస్తుందని... ఇప్పుడు తమరేదో ప్రత్యేకంగా ఇస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారని నిలదీశారు. గ్రామస్థుల నిలదీతపై సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే అక్కడ నుంచి వెనుదిరిగారు. స్థానిక నాయకుల తీరే ప్రజల వ్యతిరేకతకు కారణమని... ఎమ్మెల్యే ఆగ్రహం వక్తం చేశారు. పాణ్యం జడ్పీటీసీ సభ్యురాలు సరళమ్మ సొంత ఊర్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details