ఆంధ్రప్రదేశ్

andhra pradesh

People_Fell_Ill_After_Drinking_Contaminated_Water

ETV Bharat / videos

కలుషిత నీరు తాగి 15 మందికి అస్వస్థత - ముగ్గురి పరిస్థితి విషమం - People Fell Ill in anantapur district pamidi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 9:26 PM IST

People Fell Ill After Drinking Contaminated Water in Pamidi: కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పామిడి పట్టణంలోని బెస్తవీధిలో కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు దాదాపు 15 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 15 మందిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ నాలుగైదు రోజులుగా వీధిలోకి మినరల్ వాటర్ ఆటో రాకపోవటంతో పంచాయతీ వారు అందించే వీధి కుళాయి నీరు త్రాగటం వల్ల వారందరికి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యామని తెలిపారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపై పంచాయతీ అధికారులు స్పందించాలని తమకు తాగేందుకు మంచి నీరు అందించాలని కాలనీవాసులు అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details