People Fell Ill After Drinking Adulterated Toddy: సత్యసాయి జిల్లాలో కల్తీ కల్లు కలకలం.. 17 మందికి అస్వస్థత - సత్యసాయి జిల్లాలో కల్తీ కల్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 4:10 PM IST
People Fell Ill After Drinking Adulterated Toddy: కల్తీ కల్లు తాగి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పలువురి పరిస్థితి విషమించడంతో వారందరినీ ఆసుపత్రికి తరలించడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీరంతా మంగళవారం నుంచి తీవ్రంగా ఇబ్బంది పడినట్లు సమాచారం.
Kalti Kallu Incident in Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని నాగలూరు, బండపల్లి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కల్తీ కల్లు తాగి దాదాపు 30 మంది అస్వస్థతకు గురవ్వగా.. వారంతా బుధవారం స్వగ్రామంలోనే వైద్యం చేయించుకున్నారు. 17 మందికి తీవ్రంగా వాంతులు విరేచనాలు అవడంతో గురువారం ఉదయాన్నే 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. వారికి అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం.. అందులో పలువురి పరిస్థితి విషమించడంతో హిందూపురం వైద్యశాలకు తరలించారు. పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.