గోదావరి వరద ముంపులోనే పలు గ్రామాలు, ప్రమాదకరంగా ప్రజల ప్రయాణం - people facing problems with floods
Floods గోదావరి వరద గణనీయంగా తగ్గినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలోని పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక కాజ్వే ఈరోజు కూడా వరద ముంపులోనే ఉంది. కనకాయలంక గ్రామ ప్రజలు ముంపులో ఉన్న కాజ్వే పై నుంచి ప్రమాదకరంగా చాకలిపాలెం వైపు రాకపోకలు సాగిస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ఈరోజు 2,75,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు సముద్రంలోకి విడిచి పెడుతున్న వరద నీరు సగానికి తగ్గింది. అయినా ఇక్కడ కాజ్వే ముంపులోనే ఉంది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST