వైసీపీ బస్సుయాత్రతో ప్రజల అవస్థలు- ప్రమాదంలో స్కూల్ పిల్లలు - ఏపీ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 12:36 PM IST
People Facing Problems in YCP Bus Yatra: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సుయాత్రతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా అంబేద్కర్ కూడలి నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి వరకు రహదారులను బారికేడ్లతో మూసివేశారు. సాయంత్రం జరిగే కార్యక్రమానికి ఉదయం నుంచే రోడ్లను మూసివేయడంతో స్కూల్ పిల్లలు, వ్యాపారులు ప్రమాదకర రీతిలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు పెట్టడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
YSRCP Samajika Sadhikara Bus Yatra: సామాజిక బస్సుయాత్ర అంటే ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనా అంటూ విమర్శిస్తున్నారు. సాయంత్రం అంబేద్కర్ కూడలిలో జరిగే సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలను ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సామాజిక బస్సుయాత్ర అంటే ఇదేనా ప్రజలను ఇబ్బందులు గురి చేయడమే నా అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. హిందూపురం ప్రధాన రోడ్డులో ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేయించడంతో విమర్శలు వెల్లువెత్తాయి