ఆంధ్రప్రదేశ్

andhra pradesh

water_problem

ETV Bharat / videos

'ఓట్లు వేయించుకుని వదిలేశారు' - మూడు నెలలుగా తాగునీటికి అల్లాడుతున్న జనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 1:43 PM IST

People are Suffering From Drinking Water Facility for Three Months : ​తమ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మూడు నెలల నుంచి అధికారులు, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అనంతపురం మహిళలు రోడ్డెక్కారు. కలెక్టరేట్​ సమీపంలోని విజయనగర కాలనీవాసులు ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచి పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ అనేక సార్లు తిరిగినా అదిగో నీరు, ఇదిగో నీరు అంటున్నారని మహిళలు వాపోయారు. ఎన్నికల సమయంలో ఓటు వేయమని అడిగే ప్రజా ప్రతినిధులు, గెలిచిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటి కోసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తాము కార్పోరేషన్​, మున్సిపాలిటీ సరిహద్ధుల్లో ఉండటం వల్ల తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details