డిమాండ్లను పరిష్కరించకపోతే నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం - ఆంధ్ర పెన్షనర్ల పార్టీ - పెన్షనర్లు సమస్యలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 4:38 PM IST
PensionersSilent Revolution If Demands are Not Resolved : ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిశ్శబ్ద విప్లవానికి నాంది పలుకుతామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ ఉపాధ్యక్షులు మునయ్య వెల్లడించారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి కూడా వెనకాడమని హెచ్చారించారు. పెన్షనర్లు సమస్యలను పరిష్కరించుకోవాడానికి.. ఆంధ్ర పెన్షనర్ల పార్టీ ఆవిర్భవ కార్యక్రమాన్ని.. వచ్చే నెల 2న (డిసెంబరు 2న) విజయవాడలో పెద్ద ఎత్తు నిర్వహిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
అనంతరం తమ పార్టీ ప్రధాన డిమాండ్లను తెలిపారు. ప్రతి నెల ఒకటోవ తేదిన పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వాలని, క్వాంటం పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అలవెన్స్ ను చెల్లించాలి, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్లు మెడికల్ రీయింబర్స్ను కోత విధించకుండా మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28 లోపు పరిష్కరించకపోతే నిశ్శబ్ద విప్లవానికి నాంది పలుకుతామని ప్రభుత్వాన్ని హెచ్చారించారు.