ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pedha_kakani_police_at_guntur_tdp-_office

ETV Bharat / videos

గుంటూరు టీడీపీ కార్యాలయంలో పోలీసుల హడావుడి - మఫ్టీలో వచ్చి హల్​చల్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 9:24 PM IST

Pedha Kakani Police at Guntur TDP Office:గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పెదకాకాని పోలీసుల హడావుడి వివాదానికి దారి తీసింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడ్ని పట్టుకునే క్రమంలో పోలీసులు టీడీపీ కార్యాలయంలో హైరానా సృష్టించారు. ఓ మహిళ  ఫిర్యాదు మేరకు విజయవాడకు చెందిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడ్ని వెతుక్కుంటూ వస్తున్న పోలీసులకు.. అతడు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉన్నట్లు చూయించింది. దీంతో పార్టీ కార్యాలయంలోకి మఫ్టీలో వచ్చిన కానిస్టేబుల్ ​అక్కడ ఫొటోలు తీయసాగాడు. అదే సమయంలో ఆ కార్యాలయంలో బీసీ వర్గాల సమావేశం జరుగుతోంది. గమనించిన టీడీపీ నేతలు కానిస్టేబుల్​ను ప్రశ్నించగా.. పారిపోయేందుకు యత్నించాడు. 

నేతలందరూ కలిసి కానిస్టేబుల్​ను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పెదకాకాని సీఐ టీడీపీ కార్యాలయానికి వచ్చి.. టీడీపీ నేతలను ప్రశ్నించారు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి ఎలా వస్తారని.. టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్​ ప్రశ్నించారు. ఓ వ్యక్తిని పట్టుకునేందుకు వచ్చామని సీఐ తెలపగా.. నేరస్తుడి కోసం వచ్చామని చేప్తే తామే పట్టిచ్చేవాళ్లమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అనంతరం అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తి, నిందితుడైన చల్లా లక్ష్మీనారాయణను పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు. 

ABOUT THE AUTHOR

...view details