ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pawanklayan_meeting_with_party_leaders

ETV Bharat / videos

పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం - ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, పోటీ స్థానాలపై చర్చలు - ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 10:47 PM IST

Pawanklayan Meeting With Party Leaders: తెలుగుదేశం పార్టీ పొత్తు నిర్ణయం తర్వాత జనసేన పార్టీ పోటీచేసే స్థానాలపై దృష్టి సారించింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ నిర్వహించారు. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల నేతలతో చర్చించారు. టీడీపీతో పొత్తులో జనసేన రాబోయే శాసన సభ ఎన్నికల్లో పోటీచేసే స్థానాలపై చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పోటీ చేసే స్థానాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ అనంతరం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని యువగళం బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, సామాజిక సమీకరణలపై నాయకులతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జనసేన బీజేపీ పొత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ చేసే స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ చర్చలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details