Pawan Kalyan Reaction on Annamayya Dam: "ప్రభుత్వ నిబద్ధత చూడాలంటే మరో నెల ఆగాలి" - pawan Kalyan Latest Comments
Pawan Kalyan Reaction on Annamayya Dam Flood Victims Houses: అన్నమయ్య డ్యామ్ వరద బాధితులకు నెలలో ఇళ్ల నిర్మాణం అంటూ అధికారులు చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తన స్పందనను తెలిపారు. అధికారులు చెప్పిన నిబద్ధతను ఎంత వరకు నెరవేర్చారో చూడాలంటే జనసేన మరో నెల రోజులు ఆగాల్సిందేనన్నారు. అధికారుల కంటిచూపు సరైన ప్రతిస్పందన కాదని తాను భావిస్తున్నానన్న పవన్ ప్రకటించారు. ప్రభుత్వ చర్యలు మోకాలడ్డే విధంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అన్నమయ్య డ్యామ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ట్వీట్ చేశారు.
అసంపూర్తిగా నిర్మితమై ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేసి.. వరద బాధితులకు ఉపశమనం కల్పిస్తామని అధికారులు వరద బాధితులకు హామీనిచ్చారు. ఇతర మౌలిక వసతులను, సదుపాయాలను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేసి కల్పిస్తామని భరోసానిచ్చారు. తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, విద్యుత్ లైన్లు, ఇళ్ల పట్టాల పంపిణీ వంటివన్నీ పూర్తి చెేస్తామని హామీనిచ్చారు.