Pawan Kalyan Mouna Deeksha: విద్వేష రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం.. దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలి : పవన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 3:51 PM IST
Pawan Kalyan Mouna Deeksha: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు గంటల పాటు మౌనదీక్ష చేపట్టారు. దీక్షకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సువర్ణ కల్యాణ మండపానికి విచ్చేసిన పవన్.. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Pawan Kalyan Comments:పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. 2024లో జనసేన ప్రభుత్వం వచ్చాక.. గాంధీ జయంతిని బందరులో చేసుకుందామని అన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనన్న పవన్ కల్యాణ్.. వైఎస్ జగన్ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదని విమర్శించారు. జగన్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. అతని (జగన్) ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించానని అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంపేసిందని పవన్ మండిపడ్డారు. రాజకీయాల్లో బురద పడుతుందని తనకు తెలుసని.. అయినా ముందుకే సాగుతామని పవన్ వ్యాఖ్యానించారు. మౌన దీక్షలో పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.