ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pattabhi_fires_on_botsa_satyanarayana_in_vizianagaram

ETV Bharat / videos

'విజయనగరం జిల్లాను బి-కంపెనీ అడ్డగోలుగా దోచేస్తోంది - ఖాళీ స్థలం కనబడితే ఖతమే' - లుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 5:00 PM IST

Updated : Dec 15, 2023, 6:59 PM IST

Pattabhi Fires On Botsa satyanarayana in Vizianagaram :విజయనగరం జిల్లాను బి - కంపెనీ అడ్డగోలుగా దోచేస్తోందని తెలుగుదేశం ఆరోపించింది. ఖాళీ స్థలం కనబడితే బొత్స కుటుంబం వాలిపోతోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపణలు గుప్పించారు. ఈ ఐదేళ్లలో బొత్స పరివారం ఆగడాలు పెచ్చుమీరాయన్న ఆయన చివరికి భోగాపురం విమానాశ్రయ భూములను కూడా వదల్లేదన్నారు. ఒకప్పుడు విజయగరం జిల్లా పేరు చెబితే కళలు, సాహిత్యం, అశోక్ గజపతిరాజు కుటుంబం దాతృత్వం గుర్తుకు వచ్చేది. ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన 'బి' గ్యాంగ్ భూ దందాలు, అక్రమాలు, దోపిడీలు వినిపిస్తున్నాయని పట్టాభి రామ్ పేర్కొన్నారు.   

Pattabhi Severe Allegation on Minister Botsa Family : నారా లోకేశ్ యువగళం ముగింపు సభ సన్నద్ధతలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. యువగళం ముగింపు సభ కమిటీ సభ్యులు అశోక్ గజపతిరాజు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో చర్చించారు. అనంతరం వారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన బంధువర్గం అక్రమాలపై ధ్వజమెత్తారు. 

Last Updated : Dec 15, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details