ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Patients Suffering Due to Power Cut in Hospital

ETV Bharat / videos

Patients Suffering Due to Power Cut in Yemmiganur Area Hospital: ఆసుపత్రిని కమ్మేసిన చీకటి.. విద్యుత్ లేక రోగులు అవస్థలు - power cut problems in andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 7:26 PM IST

Patients Suffering Due to Power Cut in Hospital: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఆసుపత్రులకు చేరాయి. నిత్యం వందలాది మంది వచ్చే ఆసుపత్రిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ విద్యుత్ లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయక చీకట్లోనే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందికి గురయ్యారు. ఆసుపత్రికి ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని పలు గ్రామలతో పాటు పట్టణవాసులు సుమారు 500 మంది వైద్యం కోసం వచ్చారు. ఆసుపత్రిలో అక్కడక్కడా ఇన్వర్టర్లు ఉన్నా.. అవి కొద్ది సేపు మాత్రమే పని చేశాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రిలో నెలకు రెండొందలకు పైగా ప్రసవాలు జరుగుతాయి. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details